సృష్టిలో ఏ కులం గొప్పది కాదు, అన్ని కులాలు సమానమే అంటూ., ఆదిశంకరాచార్య గారి "శంకర విజయాన్ని" స్పూర్తిగా తీసుకొని అందులోని ఆదిశంకరులకి ఎదురువచ్చిన వెనుకపడ్డ కులస్తుడిలో కూడా దేవుడిని చూడమంటూ తెలిపిన వైనాన్ని అద్వితీయం.
ఒక వ్యక్తి మనసు పరాయివ్యక్తి సొంతమైనప్పుడు ఆ యువతిలో ఆది పరాశక్తిని చూపిన వైనం ఏమని వర్ణించగలం .,
పుట్టుకతో కులాలు కాదు వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి అంటూ భగవద్గీత లోని
“చాతుర్వర్ణం మయాసృష్టం గుణ కర్మ విభాగచ” అనే స్లొకంతో కులాలను ప్రశ్నించిన మహోన్నత చిత్రం
చక్కని సాహిత్యంతో కూడుకున్న సంగీత సాగరం వంటి చిత్రం "సప్తపది".,
ఇటువంటి చిత్రాన్నినిర్మించిన విశ్వనాథ్ గారికి పాదాభివందనం
చిత్రం చూస్తున్నంతసేపు ఒక పవిత్ర దేవాలయంలో ఉన్నమనే భావన మనసులో సృష్టించిన విశ్వనథ్ గారికి మనమందరం ఎంతో రుణపడిఉన్నమో
No comments:
Post a Comment